Gooty: గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య!
Gooty: గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు.
Gooty: గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య!
Gooty: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వయస్సు, పేరు, స్వస్థలం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.




