Gooty: ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలు: ఎంఈఓకు ఎస్‌ఎఫ్ఐ వినతి!
Gooty: ప్రభుత్వ సమయపాలన పాటించకుండా విద్యార్థులను ఉదయం నుండి రాత్రి వరకు నిర్బంధిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని SFI నాయకులు ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.
Gooty: ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలు: ఎంఈఓకు ఎస్‌ఎఫ్ఐ వినతి!
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సమయపాలన పాటించని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని SFI మండల కార్యదర్శి నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం మండల విద్యాధికారి మనోహర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ, స్థానిక గుత్తి పట్టణంలోని కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యార్థులను ట్యూషన్ల పేరుతో పాఠశాలల్లోనే నిర్బంధించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన సమయపాలన పాటించకుండా విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి పాఠశాలలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు చర్యలు తీసుకోకపోతే SFI ఆధ్వర్యంలో సంబంధిత పాఠశాలల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులు చంద్రశేఖర్, చరణ్, విజయ్, మధు తదితరులు పాల్గొన్నారు.




