Gooty: రాధాకృష్ణన్ జయంతి, మదర్ థెరిసా వర్ధంతి వేడుకలు

Gooty: గుత్తి పెన్షనర్ల భవనంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి, మదర్ థెరిసా 29వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వారి చిత్రపటాలకు నివాళులర్పించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 5 Sept 2026 5:04 PM IST
Gooty
X

Gooty: రాధాకృష్ణన్ జయంతి, మదర్ థెరిసా వర్ధంతి వేడుకలు

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 138వ జయంతి, మదర్ థెరిసా గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పెన్షనర్ల సంఘం ప్రెసిడెంట్ అబూబాకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, జాయింట్ సెక్రటరీ విజయలక్ష్మి గారు సర్వేపల్లి రాధాకృష్ణన్, మదర్ థెరిసా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962 నుండి 1967 వరకు రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడని కొనియాడారు. ఆయనకు భారతరత్న, టెంపుల్టన్ పురస్కారాలు లభించాయని తెలిపారు.

మదర్ థెరిసా పేదలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించి, రోగులకు సేవ చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారని, ఆమె 1997 సెప్టెంబర్ 5న మరణించారని కోశాధికారి కుల్లాయిబాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్ మోహన్, విజయలక్ష్మి, లక్ష్మీనారాయణ రెడ్డి, షైక్షావళి, నారాయణరెడ్డి, హసన్ అహ్మద్, మద్దులేటి, దేవదాస్, నారాయణ శెట్టి, గోవిందప్ప, నరసింహులు, ఓబులేసు, దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story