Anantapur: అగ్నిప్రమాదం: షాప్ దగ్ధం, రూ.40 లక్షల ఆస్తి నష్టం!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి ఆర్‌ఎస్‌లోని శ్రీ శ్రీనివాస సప్లయర్స్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది.
Anantapur: అగ్నిప్రమాదం: షాప్ దగ్ధం, రూ.40 లక్షల ఆస్తి నష్టం!
అనంతపురం జిల్లా:
గుత్తి ఆర్ఎస్ లో షాపు అగ్నికి ఆహుతి- 40 లక్షల నష్టం, బాధితుడికి అండగా ఉంటా:
అనంతపురం జిల్లా గుత్తి పట్టణం లో స్థానికంగా నివాసముంటున్న శ్రీ శ్రీనివాస సప్లయర్స్ నారాయణ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులోని వ్యాపార సామాగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 40 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా.
విషయం తెలుసుకున్న గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం తనయుడు, గుత్తి మరియు పామిడి మండలాల టీడీపీ ఇన్చార్జ్ యువనేత శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ వెంటనే గుత్తి పట్టణంలోని బాధితుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




