Anantapur: వానల కోసం గుత్తి కాశీ విశ్వేశ్వర ఆలయంలో వరుణ యాగం
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పురాతన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Anantapur: వానల కోసం గుత్తి కాశీ విశ్వేశ్వర ఆలయంలో వరుణ యాగం
గుత్తి: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు Y. వెంకటరామిరెడ్డి గారి సూచన మేరకు గుత్తి పట్టణంలోని పురాతన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గుత్తి వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వరుణ యాగం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సకాలంలో వర్షాలు పడక రైతులు సాగుకు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వర్షాలు సకాలంలో కురవాలని కాశీ విశ్వేశ్వరుడిని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి, మాజీ కన్వీనర్ హుస్సేన్ పీరా, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్, వైసీపీ రాష్ట్ర నాయకులు కోన మురళీధర్ రెడ్డి, C.V. రంగారెడ్డి, రాం రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు వాల్మీకి శివరాం, రమేష్ రెడ్డి, వరదరాజులు, కలగట్ల రాము,
మల్లికార్జున, ఉభిచర్ల నారాయణస్వామి, ఖురేషి అన్వర్, KM రంగనాయకులు, బళ్లారి హరినాథ్ రెడ్డి, రంగప్రసాద్ రాయల్, అరుణ్ కుమార్, నెమతాబాద్ రఘునాథ్ రెడ్డి, వెల్డింగ్ అబ్దుల్ రౌఫ్, పోలీస్ అబ్దుల్, LIC హరినాథ్ రెడ్డి, DM మహబూబ్ బాషా, జాకం దేవవారం, ఇంతియాజ్, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు.




