Puttaparthi: లంచం తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ బాధితుడు ఆవేదన

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట విఆర్ఓ రామ్మోహన్ భూమి మ్యుటేషన్ కోసం రూ. 1.5 లక్షల లంచం తీసుకున్నారని మహేందర్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

L.Sudhakar, Puttaparthy
Published on: 27 April 2026 7:25 PM IST
Puttaparthi
X

Puttaparthi: లంచం తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ బాధితుడు ఆవేదన

Puttaparthi: శ్రీ సత్య సాయి జిల్లా గాండ్లపెంట మండల తాసిల్దార్ బాబురావు వీఆర్వో రామ్మోహన్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన భూమి బాధితుడు. మల మీద పల్లి గ్రామంలో ఉన్న వీఆర్వో తమ భూములు పెట్టేందుకు లక్ష యాభై వేల రూపాయల లంచం తీసుకునీ చేయకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన బాధితుడు.

గాండ్లపెంట మండలం మలమీద పల్లి గ్రామంలో సర్వే నంబర్ 776 89 లో తన భార్య పేరు మీద ఉన్న ఐదు ఎకరాల భూమిని లక్ష్మీదేవి అనే మహిళ నుంచి తన భార్య కల్పనా పేరు మీద భూమినీ కొన్న బాధితుడు.

భూమి కొనే రిజిస్ట్రేషన్ చేసుకున్న కూడా వెబ్ ల్యాండ్ నుండి అమ్మిన మహిళ పేరు తొలగించకుండా తమ పేరు ఎక్కించకుండా విఆర్ఓ బెదిరిస్తున్నాడు అంటూ కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్న బాధితుడు మహేందర్ రెడ్డి.

వివరంగా విన్న కలెక్టర్ విచారించి నిజమైన తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి కొన్న భూమిని వెబ్ ల్యాండ్ లో తమ పేరు ఎక్కించాలని కోరితే రెవిన్యూ అధికారులు నాతో డబ్బులు తీసుకుని మరీ మమ్మల్ని పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.

రెవెన్యూ అధికారులు డబ్బులు ఇస్తే ఏపైననే చేస్తారని ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని బాధితుడు కోరుతున్నాడు. తక్షణమే స్పందించి న్యాయం చేయాలని బాధితుడు అధికారులను కోరుతున్నాడు.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy

Next Story