Gajukuntapalli: ఈద్గాహ్ స్థలం లేక నేషనల్ హైవే రోడ్డు పైనే నమాజ్ ప్రార్థనలు

Gajukuntapalli: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి. చెరువు మండలం గాజుకుంటపల్లిలో నేషనల్ హైవే విస్తరణతో ఈద్గా, ఖబ్రిస్తాన్ భూమి కోల్పోయిన మైనారిటీలు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 28 May 2026 4:25 PM IST
Gajukuntapalli
X

Gajukuntapalli: ఈద్గాహ్ స్థలం లేక నేషనల్ హైవే రోడ్డు పైనే నమాజ్ ప్రార్థనలు

గాజుకుంటపల్లి: నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా గతంలో ఉన్న ఈద్గాహ్, ఖబర్స్తాన్ కు భూమి తొలగిపోవడంతో గాజుకుంటపల్లితో పాటు ఇనగలూరు, గొల్లపల్లి గ్రామాలకు చెందిన మైనారిటీ ప్రజలు రంజాన్, బక్రీద్ నమాజ్లు, ఇతర మతపరమైన కార్యక్రమాలను రహదారిపైనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గాజుకుంటపల్లి పంచాయతీకి చెందిన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా, మృతదేహాల ఖననం కోసం సరైన స్థలం లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై గత రెండు నుంచి మూడు సంవత్సరాలుగా జిల్లా అధికారులు, రెవెన్యూ శాఖ, సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించలేదని పేర్కొన్నారు.

ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి గాజుకుంటపల్లి, ఇనగలూరు, గొల్లపల్లి గ్రామాల మైనారిటీ ప్రజలకు ఈద్గాహ్, ఖబర్స్తాన్ కోసం తక్షణమే తగిన స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు, నేషనల్ హైవే అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story