Kadiri: కదిరిలో ఎమ్మెల్యే కందికుంటను కలిసిన గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను కలిసిన గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు.. ఉచిత విద్యుత్, సింగిల్ విండోపై కృతజ్ఞతలు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 12 Sept 2026 1:18 PM IST
Kadiri
X

Kadiri: కదిరిలో ఎమ్మెల్యే కందికుంటను కలిసిన గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు, సింగిల్ విండో విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను సులభతరం చేసిన కూటమి ప్రభుత్వానికి, విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి నివాసంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ కల్పించడం, సింగిల్ విండో ద్వారా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం పట్ల ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు.

గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితితో సమన్వయం చేసుకుని, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సహకారం అందించాలని ప్రతినిధులు కోరారు.

అదేవిధంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు, ప్రజలకు మేలు కలగాలని ఆకాంక్షిస్తూ గణేష్ మండపాల్లో ప్రతిరోజూ రెండుపూటలా పూజల అనంతరం నిర్వహించాల్సిన వరుణ జపానికి సంబంధించిన సంకల్పం, బీజాక్షర మంత్రంతో కూడిన కరపత్రాన్ని ఎమ్మెల్యే గారికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవాల నిర్వహణలో భక్తులు, నిర్వాహకులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ వినాయక స్వామిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI