Pamidi: వినాయక మండపాలకు విరాళాలు అందించిన మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు!
Pamidi: అనంతపురం జిల్లా పామిడిలో వినాయక మండపాలకు విరాళాలు అందించిన మాజీ కౌన్సిలర్ వైయూ రామాంజనేయులు.. మట్టి వినాయకుడిని పూజించాలని పిలుపు.
Pamidi: వినాయక మండపాలకు విరాళాలు అందించిన మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు!
Pamidi: వినాయక చవితి సందర్భంగా గుంతకల్లుకు చెందిన మాజీ కౌన్సిలర్ వైయూ రామాంజనేయులు వినాయక మండపాలకు ఆర్థిక సహాయం అందించారు.
సంతమార్కెట్ వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ వారికి 10,116 రూపాయలు, గుప్తా కాలనీ దత్త గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వినాయకుడి విగ్రహానికి 10,116 రూపాయలు, అలాగే మడికట్ల ఆంజనేయస్వామి శివ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ తిరుమల బృందం భజన కీర్తనలు, పోటీల బహుమతికి 5,116 రూపాయలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వైయూ రామాంజనేయులు మాట్లాడుతూ "వినాయకుడు మట్టి విగ్రహాలను పూజిద్దాం, వాతావరణాన్ని కాపాడుకుందాం" అని సలహాలు సూచనలు ఇచ్చారు. మట్టి వినాయకుడు మన పర్యావరణానికి మిత్రుడు అని పిలుపునిచ్చారు.




