Pamidi: పామిడిలో ఉదారత చాటుకున్న మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు!

Pamidi: పామిడి వెంగమనాయుడు కాలనీ ఆంజనేయ స్వామి గుడి ధ్వజస్తంభం నిర్మాణానికి రూ.60,000 విరాళం అందజేసిన మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 22 Aug 2026 12:36 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో ఉదారత చాటుకున్న మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి పంచాయతీ పరిధిలోని వెంగమనాయుడు కాలనీ నందు నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి గుడి ధ్వజ స్తంభం కోసం మాజీ కౌన్సిలర్ వై.యు. రామాంజనేయులు ఉదారత చాటుకున్నారు.

కాలనీవాసులు ధ్వజస్తంభం నిర్మాణానికి సహాయం కోరగానే వెంటనే స్పందించిన రామాంజనేయులు గారు రూ. 60,000/- విరాళంగా అందజేశారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని కాలనీవాసులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జింక రామకృష్ణ, మేజర్ లక్ష్మీనారాయణ, అంజి నాయక్, వడ్డే రాము, సూరి, మాధవయ్య, మస్తాన్, యుగంధర్, దుదు రాజశేఖర్, లారీ ఓబులేసు, బాబా, దొడ్డమ్మ, నారాయణమ్మ, తులసమ్మ, ఫక్రున్ని, లక్ష్మి, లావణ్య, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

కాలనీవాసులు మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story