Kadiri: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా జయరాములు
Kadiri: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కదిరి నియోజకవర్గానికి చెందిన దోరణాల జయరాములు నియామకం. పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన జయరాములు.
Kadiri: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా జయరాములు
కదిరి: భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారి మార్గదర్శకత్వంలో,బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ నాయకత్వంలో,రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ సమన్వయంతో, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ రాష్ట్ర కమిటీలో వివిధ కీలక పదవులకు సంస్థా గత నియామకాలను ప్రకటించారు.
ఇందులో భాగంగా సత్యసాయి జిల్లా కదిరి నియోజక వర్గానికి చెందిన దోరణాల జయరాములును రాష్ట్ర ఎస్సి మోర్చ అద్యక్షులు రాష్ట్ర సోషియల్ మీడియా కో కన్వీనర్ గా నియమించారు. జయరామ్ మాట్లాడుతూ ఓ చిన్న మారుమూల గ్రామంలో ఉన్న తనను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాధ్యత ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
కార్యకర్తను గుర్తించటంలో కేవలం బిజేపీకే సాధ్యం అన్నారు.అంతే కాకుండా గతంలో కదిరి నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా,జిల్లా మీడియా కన్వినర్,సోషియల్ మీడియా కన్వీనర్,సమాచార చట్ట హక్కు కన్వీనర్ ఇలా పార్టీ ఇచ్చిన బాధ్యతలను తన శక్తి మేరకు పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను గుర్తించి నా మీద నమ్మకంతో నాకు రాష్ట్ర బాధ్యతను కల్పించిన సురేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే ఈ బాధ్యత రావడానికి కృషి చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్,రాష్ట్ర నాయకులు చంద్ర మౌళి,జాతీయ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్,మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థ సారథి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు,జిల్లా అద్యక్షులు శేఖర్ స్వామి,ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్,శాంత కుమార్,గారికి ధన్యావాదాలు తెలిపారు.




