Anantapur: గుత్తిలో మూడో రోజుకు దస్తవేజు లేఖర్ల సమ్మె!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తిలో మూడో రోజుకు చేరిన దస్తవేజు లేఖర్ల నిరసన. జీవో 396 రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఉపసంహరించాలని డిమాండ్.
Anantapur: గుత్తిలో మూడో రోజుకు దస్తవేజు లేఖర్ల సమ్మె!
Anantapur: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దస్తవేజు లేఖర్ల సమ్మె మంగళవారంతో మూడో రోజుకు చేరింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జిఓ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తవేజు లేఖర్లు ఆందోళన నిర్వహించారు. "రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు వద్దు - డాక్యుమెంట్ రైటర్లు ముద్దు" అంటూ నినాదాలు చేశారు.
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని, జిఓను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీకరం నరేష్ బాబు, బండి సత్య, అనంతయ్య, బండి నిరంజన్, రంగస్వామి, రమణ, హరిబాబు, సాయి రంగస్వామి, రామకృష్ణ, తాజుద్దీన్, రవి, రాయల్, రఘువీర్, సాయి తదితర దస్తవేజు లేఖర్లు పాల్గొన్నారు.
Next Story




