Pamidi: ఎస్సీ కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఆదేశం!

Pamidi: పి.కొండాపురం ఎస్సీ కాలనీలోని మినీ వాటర్ ట్యాంకును డిప్యూటీ ఎంపీడీవో అశ్వర్థమ నాయుడు, ఈఓ శివమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేసి తాగునీటి సరఫరాపై ఆరా తీశారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 5 Aug 2026 12:37 PM IST
Pamidi
X

Pamidi: ఎస్సీ కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఆదేశం!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం పి కొండాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల *మినీ వాటర్ ట్యాంకు*ను డిప్యూటీ ఎంపీడీవో అశ్వర్థమ నాయుడు మరియు ఈఓ శివమూర్తి ఆకస్మికంగా పరిశీలించారు.

అధికారులు ట్యాంకులోని నీటి నిల్వ, పంపు మోటారు పనితీరు, పైపులైన్ల ద్వారా ఇంటింటికి సరఫరా అవుతున్న తీరును పరిశీలించారు. గ్రామస్తులకు సక్రమంగా తాగునీరు అందుతుందా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో అశ్వర్థమ నాయుడు మాట్లాడుతూ, ఎస్సీ కాలనీలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ట్యాంకు ఆవరణలో పరిశుభ్రత పాటించాలని, ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో , సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story