Puttaparthi: పుట్టపర్తిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ షురూ.. ప్రారంభించిన కలెక్టర్!

Puttaparthi: పుట్టపర్తి మున్సిపాలిటీలో నాలుగు వారాల పాటు నిర్వహించే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం ప్రారంభించారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 23 May 2026 3:31 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ షురూ.. ప్రారంభించిన కలెక్టర్!

పుట్టపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" మార్గదర్శకాల ప్రకారం పుట్టపర్తి మున్సిపాలిటీలో నాలుగు వారాల పాటు నిర్వహించే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’కార్యక్రమం గణేష్ సర్కిల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పుట్టపర్తిని పరిశుభ్రంగా ఉంచి 'స్వర్ణాంధ్ర' లక్ష్యాన్ని సాధించాలన్నారు. శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య మౌలిక వసతుల బలోపేతం మరియు ప్రజల భాగస్వామ్యం ద్వారానే ఇది సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. మే 23 నుండి జూన్ 19 వరకు నాలుగు వారాల పాటు ఈ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ మున్సిపాలిటీ వ్యాప్తంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ, మున్సిపల్ ప్రత్యేక అధికారి సువర్ణ, మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు, డీఈఓ క్రిస్టప్ప, మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, సచివాలయ మరియు మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story