Puttaparthi: లక్ష కోట్లతో యుద్ధ విమానాల పరిశ్రమ.. 20 వేల ఉద్యోగాలు!

Puttaparthi: ఈ నెల 15న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 12 May 2026 8:40 PM IST
Puttaparthi
X

Puttaparthi: లక్ష కోట్లతో యుద్ధ విమానాల పరిశ్రమ.. 20 వేల ఉద్యోగాలు!

Puttaparthi: పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేద్దాం — మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి.

ఈ నెల 15న పుట్టపర్తిలో జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.

పుట్టపర్తిలో సీఎం సభ, పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తో పాటు జేసీ మంత్రి మౌర్య భరద్వాజ్ ,ఏఎస్పీ అంకిత సూరానా, జిల్లా అధికారులతో కలిసి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. సీఎం సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు సౌకర్యాలు వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మున్సిపల్ మెప్మా గ్రామైక్య సభ్యులు, కూటమి పార్టీల నాయకులతో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి పుట్టపర్తి కేంద్ర బిందువుగా మారబోతుందని అన్నారు. లక్ష కోట్లతో యుద్ధ విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో గర్వ కారణమన్నారు.

ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల పుట్టపర్తి ప్రాంతంలో సుమారు 20వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశంలోనే ఇంత భారీ స్థాయిలో పుట్టపర్తి ప్రాంతంలో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడానికి అత్యంత కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటనతో పుట్టపర్తికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించి, భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ్, ఆర్డీవో సు , డి.ఎస్.పి నారాయణస్వామి, డీఎస్ఓ వంశీకృష్ణ, ట్రాన్స్కో ఎస్సీ మోషేస్ , డిపిఓ సమత ,ఈఈ శివరాముడు ,ఇతర అధికారులు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు బోయ రామాంజనేయులు, సామకోటి ఆదినారాయణ, రత్నప్ప చౌదరి ,ఎల్ఐసి నరసింహులు, శ్రీరామ్ రెడ్డి, బెస్త చలపతి , ఒలిపి శ్రీనివాసులు, సలాం ఖాన్ , బేకరి నాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story