Pamidhi: పామిడిలో ఘనంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!

Pamidhi: పామిడి 20వ వార్డులో టీడీపీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 13 Sept 2026 2:35 PM IST
Pamidhi
X

Pamidhi: పామిడిలో ఘనంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!

Pamidhi: అనంతపురం జిల్లా పామిడి పట్టణం 20వ వార్డులో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పామిడి పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు ఎంహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం వద్ద కాలనీవాసులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఇంట్లోనే పూజించాలని కోరారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

అలాగే ప్రతి ఇంట్లో ఒక మొక్కను నాటి, దానిని చెట్టుగా పెంచాలని కాలనీవాసులకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు ప్రజలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL