Anantapur: గుమ్మగట్ట మండలంలో కర్ణాటక చిత్రదుర్గ అధికారుల బృందం పర్యటన!

Anantapur: కర్ణాటక చిత్రదుర్గ జిల్లా ప్రతినిధుల బృందం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో పర్యటించి, అభివృద్ధి పనులను పరిశీలించింది.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 11 Aug 2026 9:07 PM IST
Anantapur
X

Anantapur: గుమ్మగట్ట మండలంలో కర్ణాటక చిత్రదుర్గ అధికారుల బృందం పర్యటన!

అనంతపురం: కర్ణాటక ప్రభుత్వం, చిత్రదుర్గ జిల్లా నుండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హెచ్.హనుమంతప్ప మరియు పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వారు బృందంగా గుమ్మగట్ట మండలంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ (గ్రామీణ) (VB-G-RAM- G) పథకం కింద నిర్వహించిన పనులను పరిశీలించేందుకు బృందంగా రావడం జరిగింది.

ఇందులో మొదటగా గుమ్మగట్ట మండలం 75 వీరాపురం గ్రామ పంచాయితీలో వాటర్ హార్వెస్టింగ్ పాండ్ పనిని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ పని చేస్తున్న శ్రామికులతో చర్చిస్తూ వారికి రోజువారి కూలీ ఎంత వస్తుంది, మీకు ఏ రకాల పనులను కల్పిస్తున్నారు అని అడిగడం జరిగింది. అలాగే వారు క్యాటల్ షేడ్ పనిని, మ్యాజిక్ డ్రైన్స్ కూడ పరిశీలించడం జరిగింది.

అలాగే పూలకుంట గ్రామము నందు ప్లే-ఫీల్డ్ పనిని పరిశీలించడమైనది. అలాగే గుమ్మగట్ట మండల పరిషత్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణదుర్గం, ఏపిడి సిబ్, గుమ్మగట్ట ఎంపిడిఓ, ఏపీవో, ఈసి, టెక్నికల్ అసిస్టెంట్ తో చర్చలు జరపడమైనది. ఎంసిసిలో ఎలాంటి పనులను చేస్తారు అనే వాటిని, ప్రతిపాదనలు ఎలా చేస్తున్నారు.

అన్ని రకాల బిల్స్ VB-G-RAM-G లో ఎలా చేస్తారని వారు పరిశీలించారు. వీటి గురించి చిత్రదుర్గ జిల్లా బృందం వారికి వివరణ ఇవ్వడమైనది. అలాగే తాళ్ళకెర గ్రామము, బి.టి.పి అవాసం నందు అల్ట్రా హైడెన్సిటీని పరిశీలించడం జరిగింది. చివరిగా చిత్రదుర్గ జిల్లా బృందం వారు మండలం నందు అన్నిరకాల పనులు చాలా బగున్నాయని, ఇక్కడ సిబ్బంది కూడ బాగా వివరణ ఇచ్చారు అని సంతృప్తి వ్యక్తం చేసారు.

ఈ యొక్క కార్యక్రమంలో కల్యాణదుర్గం అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజారావ్, కెపాసిటీ బిలింగ్ అసిస్టంట్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయకుమర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి.జయరాములు, అడిషనల్ ప్రోగ్రాం అధికారి సురేష్ కుమార్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ రవి కుమార్, మరియు అందరు సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాకులు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు గుమ్మగట్ట సిబ్బంది పాల్గొనడం జరిగింది.

అనంతరం సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ను డ్వామా పిడి సలీమ్ భాష, చిత్రదుర్గ జిల్లా బృందం సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story