Rayadurgam: రాయదుర్గంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు!

Rayadurgam: రాయదుర్గంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. సమైక్యాంధ్ర భవన్‌లో రక్తదాన శిబిరం, పాల్గొని రక్తదానం చేసిన బి. వెంకటరమణ.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 21 Aug 2026 3:09 PM IST
Rayadurgam
X

Rayadurgam: రాయదుర్గంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు!

Rayadurgam: రాయదుర్గంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ బి. వెంకటరమణ రాయదుర్గం మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రాయదుర్గం పట్టణంలోని సమైక్యాంధ్ర భవన్ వేదికగా 'హలో చిరంజీవి అభిమాన సంఘం' ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరంజీవి గారు చలనచిత్ర రంగానికే కాకుండా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతూ సామాజిక సేవలో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వారి పుట్టినరోజున అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఒక బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి. రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ మరియు ఏటూరి కుమార్ అబ్దుల్లా సురేష్ కుమార్ వారి మిత్ర బంధం పాల్గొన్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, అభిమానులు స్ఫూర్తితో ముందుకు వచ్చి రక్తదానం చేశారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story