Anantapur: కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపు!
Anantapur: బీజేపీ మండల అధ్యక్షుడు చౌహాన్ అంజినాయక్ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి డా. నాగేంద్ర బాబు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.
Anantapur: కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపు!
పామిడి: అనంతపురం జిల్లా పామిడిలో బిజెపి మండల అధ్యక్షుడు చౌహాన్ అంజినాయక్ ఆధ్వర్యంలో బిజెపి మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. పొగుల నాగేంద్ర బాబు అనంతపురం బిజెపి జిల్లా కార్యదర్శి, పామిడి మండల ఇంచార్జ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగేంద్ర బాబు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విమర్శలు కాకుండా కమలం గుర్తు కోసమే పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా మండల సమావేశాలు నిర్వహించాలని, ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.ప్రతి వారం కచ్చితంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అక్కడ పనివిధానాలను తెలుసుకొని జిల్లా పార్టీకి నివేదిక ఇవ్వాలన్నారు. పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్ని కచ్చితంగా నిర్వహించాలని కోరారు. మనలో ఒకరిపై కోపంతో కాకుండా కలిసికట్టుగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
"నేను ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్నాను. పార్టీపరంగా ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే జిల్లా యంత్రాంగానికి తెలియజేస్తాను" అని ఆయన హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు ఎం. కుమారస్వామి, కే. రామ నరేష్, ఉపాధ్యక్షులు మల్లికార్జున ఆచారి, వై. సుందరయ్య, యాతం వెంకట్రాం రెడ్డి, కార్యదర్శులు మంజునాథరావు, నగరూరు బాల్కొండ మల్లికార్జున, శ్రీనివాసులు, ఆనంద్, శేషాద్రి, ఎన్.వి. సుబ్రహ్మణ్యం, చాణిక్య తదితరులు పాల్గొన్నారు.




