Anantapur: సీఎం చంద్రబాబు నిర్ణయంపై బేడ బుడగ జంగాల హర్షం.. అనంతపురంలో ఘనంగా కృతజ్ఞతా సభ!

Anantapur: బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించడంపై అనంతపురంలో హర్షం.

Arun Chilukuri
Published on: 10 May 2026 7:06 PM IST
Anantapur
X

Anantapur: సీఎం చంద్రబాబు నిర్ణయంపై బేడ బుడగ జంగాల హర్షం.. అనంతపురంలో ఘనంగా కృతజ్ఞతా సభ!

అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సదస్సులో బేడ బుడగ జంగం కులస్తులకు ఎస్సీ సదుపాయాలు కల్పించాలని చెప్పడంపై అనంతపురంలో బేడ బుడగ జంగం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంతపురంలోని రాజు గార్డెన్ లో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా తమ కులం గుర్తింపు కోసం పోరాటాలు చేస్తున్న ఏ ప్రభుత్వం గుర్తించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వంలో బేడ బుడగ జంగాలకు కుల ప్రతిపాదికల గుర్తింపు ఇవ్వాలని సైకిల్ యాత్ర చేసిన పట్టించుకోలేదని గుర్తు చేసుకున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో తమకు ఎస్సీ సదుపాయాలు కల్పించాలనటం మర్చిపోలేమన్నారు. అలాగే కేంద్రం పెద్దలతో మాట్లాడి ఎస్సీ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవాళ తగిన గుర్తింపు లేక ఎంతో మంది బేడ బుడగ జంగం పిల్లలు చదువుకు దూరమై ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు గుర్తింపు వచ్చేలా కృషి చేయడం అభినందనీయమని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బేడ బుడగ జంగాల నాయకులు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story