Gooty: రాజాపురం గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక సదస్సు!

Gooty: గుత్తి మండలం రాజాపురం గురుకుల పాఠశాలలో లింగ వివక్షత, బాల్య వివాహాల నిరోధక చట్టంపై డాక్టర్ ప్రవీణ్ కుమార్ అవగాహన సదస్సు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 28 Aug 2026 5:50 PM IST
Gooty
X

Gooty: రాజాపురం గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నిరోధక సదస్సు!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపురం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో లింగ వివక్షత మరియు బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ లింగ వివక్షత కారణంగా స్త్రీ, పురుష నిష్పత్తి బాగా తగ్గిపోయిందని, సమాజంలో ఆడబిడ్డ ప్రాముఖ్యతను సమాజం గుర్తించాలని చెప్పారు. ఈరోజు ఆడబిడ్డలను వద్దనుకుంటే రేపు తల్లి, బిడ్డ, భార్య, సోదరి దొరకడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఇప్పటికే అధిక శాతం మగపిల్లలకు పెళ్లిళ్లు కాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కడుపులోని బిడ్డను అబార్షన్ పేరుతో భ్రూణ హత్యలు చేయడం చట్టరీత్యా నేరమని, స్కానింగ్ లో ఆడ, మగ నిర్ధారణ చేయరాదని, దీనివల్ల భ్రూణ హత్యలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటిని అరికట్టడానికి గర్భ లింగ నిర్ధారణ దుర్వినియోగ చట్టంపై అవగాహన పెంచడం ద్వారా లింగ వివక్షతను రూపుమాపవచ్చని తెలియజేశారు.

బాలికల విద్య వారి భవిష్యత్తుకు తోడ్పడుతుందని, పిల్లలు బడి మానేయడం ద్వారా బాల్య వివాహాలు జరగడానికి కారణం అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సి. వెంకటేష్ డిప్యూటీ హెచ్ఈఓ, ప్రిన్సిపల్ అరుణ కుమారి, ఏఎన్ఎం రోజా, ఆశా కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story