Anantapur: ఉమ్మడి అనంతపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పర్యటన!

Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పర్యటన. గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తే కఠిన చర్యలని అధికారులకు హెచ్చరిక.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 9 Sept 2026 12:26 PM IST
Anantapur
X

Anantapur: ఉమ్మడి అనంతపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి పర్యటన!

Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి రెండు రోజుల పర్యటన చేపట్టారు. పర్యటనలో భాగంగా అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బొజ్జిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు అందాయని తెలిపారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య, స్మశాన వాటికలకు స్థలాల కొరత, భూ సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారని వెల్లడించారు.గిరిజనులపై అక్రమంగా కేసులు బనాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమ కేసులు నమోదు చేస్తే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో గిరిజనులకు చేరడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.గిరిజనులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, నిధులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బొజ్జిరెడ్డి తెలిపారు.

గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ మీడియా సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story