Gooty: రెండు డీఏల మంజూరుపై పెన్షనర్ల హర్షం: గుత్తిలో సర్వసభ్య సమావేశం

Gooty: గుత్తిలో నిర్వహించిన ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సమావేశంలో రెండు డీఏల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ, ఐఆర్ కూడా ప్రకటించాలని కోరారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 12 Sept 2026 3:33 PM IST
Gooty
X

Gooty: రెండు డీఏల మంజూరుపై పెన్షనర్ల హర్షం: గుత్తిలో సర్వసభ్య సమావేశం

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సెక్రటరీ రాంమోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యలు, సంక్షేమ అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా డీఏల మంజూరుపై నారాయణరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం రెండు డీఏలను మంజూరు చేయడంపై పెన్షనర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే పెన్షనర్లకు ఐఆర్‌ (ఇంటరిమ్ రిలీఫ్) కూడా ప్రకటించి ఉంటే మరింత ప్రయోజనం కలిగేదని వారు అభిప్రాయపడ్డారు.

అనంతరం గుంతకల్‌కు చెందిన నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సమావేశానికి హాజరై కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే కర్నూలుకు చెందిన విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది హాజరై పెన్షనర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాంమోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, వైస్ ప్రెసిడెంట్ షైక్షా వళి, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, వెంకటేష్, లక్ష్మీనారాయణరెడ్డి తదితర పెన్షనర్ల సభ్యులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL