Anantapur: అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 56వ ప్రజా దర్బార్!
Anantapur: రాష్ట్రంలో త్వరలోనే 3 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా దర్బార్‌లో వెల్లడించారు.
Anantapur: అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 56వ ప్రజా దర్బార్!
Anantapur: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 56వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి.. వారి సమస్యలను ఓపిగ్గా అడిగి తెలుసుకున్నారు.
కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.ఇప్పటివరకు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో మొత్తం 1230 అర్జీలు వచ్చాయని వాటిలో కేవలం 28 అర్జీలు మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి.
పది లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చారని ఆయన ఆరోపించారు.అమరావతిని పక్కనపెట్టి గత ప్రభుత్వం తుగ్లక్ తరహాలో పాలన సాగించిందని విమర్శించారు.అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టును కూడా తిరిగి పట్టాలెక్కించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా గతంలో కేవలం 1800 క్యూసెక్కుల నీరు మాత్రమే అందేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో 3500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రస్తుతం 4 వేల క్యూసెక్కుల వరకు నీటిని తీసుకునేలా చర్యలు చేపట్టారని తెలిపారు.సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ.. తుంగభద్ర, శ్రీశైలం నుంచి 26 టీఎంసీల నీటిని తీసుకొస్తూ అనంతపురం జిల్లాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1296 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.ప్రజల సమస్యలను తెలుసుకుని.. వాటికి పరిష్కారం చూపించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.




