Narayanapuram: నారాయణపురంలో రూ.42 లక్షలతో ఆసుపత్రికి భూమి పూజ!

Narayanapuram: నారాయణపురంలో పిఎం-అభిమ్ కింద 42 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భూమి పూజ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 4 Sept 2026 4:22 PM IST
Narayanapuram
X

Narayanapuram: నారాయణపురంలో రూ.42 లక్షలతో ఆసుపత్రికి భూమి పూజ!

Narayanapuram: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో నారాయణపురంలో నూతన ఆసుపత్రి నిర్మాణం కాబోతోంది. ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకం కింద 42 లక్షలతో గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి ఆయన భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ నారాయణపురం ప్రాంతంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకొని ఇక్కడ సిబ్బంది, వైద్యులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారన్నారు. ఏ అవసరం వచ్చినా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ సమస్యకు తాము పరిష్కారం చూపించామన్నారు.

రెండేళ్ల పాలనలో తాము చేసిన వాటిని 80 వేల ఇళ్లకు వెళ్లి వివరించామన్నారు. అనంతపురం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా అదే స్థాయిలో ఉద్యోగాలు కల్పన కూడా జరుగుతోందన్నారు. అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1296 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎల్.నినో ప్రభావంపై ప్రభుత్వం ముందే అంచనా వేసి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా తాగునీటిని ముందే తగినంతగా నిల్వ చేసుకుంటున్నట్లు చెప్పారు. రైతులెవరు వరి, మిర్చి లాంటి పంటలు వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story