Anantapur: లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేసిన దగ్గుబాటి ప్రసాద్!
Anantapur: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేతుల మీదుగా CMRF చెక్కుల పంపిణీ.
Anantapur: లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేసిన దగ్గుబాటి ప్రసాద్!
Anantapur: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు.
ఈరోజు అనంతపురం అర్బన్ టీడీపీ ప్రధాన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. 8 మంది పంపిణీ చేసిన12,56,797/- (పన్నెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు)
ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
ఆరోగ్య సమస్యలు మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడానికి మా కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సహాయం నేరుగా అందేలా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తమకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా కృషి చేసినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.




