Anantapur: అనంతపురంలో టీడీపీ భారీ కాగడాల ప్రదర్శన నిజం గెలిచింది!
Anantapur: అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నేతృత్వంలో 'పగబట్టి చేశారు-నిజం గెలిచింది' పేరుతో టీడీపీ భారీ కాగడాల ప్రదర్శన.
Anantapur: అనంతపురంలో టీడీపీ భారీ కాగడాల ప్రదర్శన నిజం గెలిచింది!
Anantapur: నిజాయితీకి సంకెళ్లు వేసి సైకో జగన్ రెడ్డి రాక్షసానందం పొందారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో 'పగబట్టి చేశారు-నిజం గెలిచింది' పేరుతో అనంతపురం నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు నియోజకవర్గ పరిధిలోని టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజం గెలిచిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టవర్ క్లాక్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ఈ ప్రదర్శన సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ సెప్టెంబర్ 9- 2023 అన్నది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తి చంద్రబాబు అని.. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ఎన్ని సేవలు అందించారో తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోరున్నారు. అలాంటి వ్యక్తిని... అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భందించారన్నారు.
నాడు జైలు గోడల మధ్య చంద్రబాబు గారు పడ్డ కష్టం, క్యాడర్ చేసిన త్యాగాలు వృథా పోలేదని.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్లీ సుపరిపాలన వైపు అడుగులు వేస్తోందన్నారు. చంద్రబాబు పై కక్ష సాధింపులకు పాల్పడిన వైసీపీకి రాష్ట్రంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు.




