Anantapur: అనంతపురంలో రాజకీయ సెగలు.. వైసీపీ ఆఫీస్ వద్ద రణరంగం!
Anantapur: అనంతపురం జిల్లాలో హైటెన్షన్. వైసీపీ నేతల తాడిపత్రి పర్యటన భగ్నం. వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులతో తోపులాట, రణరంగం.
Anantapur: అనంతపురంలో రాజకీయ సెగలు.. వైసీపీ ఆఫీస్ వద్ద రణరంగం!
Anantapur: అనంపురం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తాడిపత్రి పర్యటనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో.. అనంతపురంలోని వైసిపి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాడిపత్రి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై వైసిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి తమ పార్టీ శ్రేణులతో కలిసి వైసిపి కార్యాలయం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించిన నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
దీంతో పార్టీ కార్యాలయం పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరినీ అనంత వెంకటరామిరెడ్డి నివాసానికి తరలించి, అక్కడే గృహనిర్బంధం చేశారు. నేతల ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు మోహరించారు.




