Anantapur: నెమళ్ళపల్లిలో ఉపాధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో ప్రభాకర్!

Anantapur: పామిడి మండలం నెమళ్ళపల్లిలో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ప్రభాకర్ తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్లు, కూలీల వసతులపై ఆరా తీసి అధికారులకు సూచనలిచ్చారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 1 Aug 2026 10:16 AM IST
Anantapur
X

Anantapur: నెమళ్ళపల్లిలో ఉపాధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో ప్రభాకర్!

నెమళ్ళపల్లిలో ఉపాధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో ప్రభాకర్

- నాణ్యత, హాజరు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలన

అనంతపురం జిల్లా పామిడి మండలం నెమళ్ళపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో ప్రభాకర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పనుల వద్ద హాజరైన కూలీల వివరాలు, హాజరు రిజిస్టర్లు, మెజర్‌మెంట్ బుక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల నాణ్యత, ప్రమాణాలను అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కూలీలతో మాట్లాడి పని గంటలు, వేతనాల చెల్లింపు, మంచినీరు, నీడ వంటి కనీస వసతులపై ఆరా తీశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ఉపాధి పనుల్లో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story