Anantapur: మా కూతురికి న్యాయం చేయండి.. మంత్రి లోకేష్‌ను వేడుకున్న తల్లి
Anantapur: అనంతపురం ట్రిల్లీ స్కూల్‌లో చిన్నారిపై అసభ్య ప్రవర్తన ఘటనపై మంత్రి లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
Anantapur: మా కూతురికి న్యాయం చేయండి.. మంత్రి లోకేష్‌ను వేడుకున్న తల్లి
అనంతపూర్: అనంతపురం నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ స్కూల్‌లో దారుణం వెలుగుచూసింది మంత్రి లోకేష్ సార్ మా కూతురికి న్యాయం చేయండి అంటూ ఓ తల్లి ఆవేదన.
పాఠశాల ప్రాంగణంలోనే ఒక చిన్నారిపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది.
అనంతపురం నగరంలోని ట్రిల్లీ స్కూల్.సదరు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న చిన్నారి.అదే పాఠశాలలో వాష్‌రూమ్‌లు శుభ్రం చేసే ఎల్లప్ప (సుమారు 50 ఏళ్లు) అనే వ్యక్తి చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లి ఆరోపిస్తోంది.
పాఠశాలలో జరిగిన ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని బాధిత చిన్నారి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యా సంస్థ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, తమకు రాజకీయ బలం ఉందంటూ బెదిరింపులకు దిగారని ఆమె వాపోతోంది.
చిన్నారికి తక్షణమే న్యాయం జరగాలని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంతో పాటు, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తున్నారు.




