Anantapur: మొహర్రం వేడుకలు.. దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు!

Anantapur: పాతవూరు దర్గాలో మొహర్రం వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 26 Jun 2026 7:11 PM IST
Anantapur
X

Anantapur: మొహర్రం వేడుకలు.. దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు!

అనంతపూర్: అనంతపురంలో పవిత్ర మొహరం పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.నగరంలోని పాతవూరులో ఉన్న ప్రసిద్ధ మాస్ మాబి సారాభి దర్గా పీర్ల మకాంను ఎమ్మెల్యే సందర్శించారు.

ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మరియు ప్రజలందరి మధ్య ఐక్యత వర్ధిల్లాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

మొహరం ప్రార్థనల అనంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. స్వయంగా ఆయనే భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

"మొహరం పండుగ అనేది మత సామరస్యానికి ఒక గొప్ప ప్రతీక. కులమతాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసిమెలిసి జీవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది."అని దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దర్గా కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, భక్తులు పాల్గొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story