Anantapur: 27 నుంచి ఇంటింటికి TDP సంక్షేమ ప్రచారం

Anantapur: ఈనెల 27 నుంచి కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఇంటింటికీ వివరిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. తల్లికి వందనంతో 67 లక్షల మందికి మేలవుతుందన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 23 July 2026 12:43 PM IST
Anantapur
X

Anantapur: 27 నుంచి ఇంటింటికి TDP సంక్షేమ ప్రచారం

అనంతపురం: గతంలో టిడిపి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సరిగా ప్రజల్లోకి తీసుకెళ్ల లేక నష్టపోయామని.. ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.

అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆయన మూడవ బుధవారం సందర్భంగా పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తామన్నారు.

గత ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టారన్నారు.

రాష్ట్రాన్ని స్కాముల ఆంధ్ర ప్రదేశ్ గా చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని దగ్గుపాటి విమర్శలు చేశారు.

మరోవైపు తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్న అందరికీ 15వేల చొప్పున ఇవాళ 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు అందజేస్తున్నారన్నారు. ఇందుకోసం 10వేల 120 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మబడి అందించారని దానివల్ల పిల్లలు చాలామంది చదువుకు దూరమయ్యారని గుర్తు చేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటి పరిస్థితి లేకుండా ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం అందజేస్తున్నామని దగ్గుపాటి తెలిపారు..

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story