Anantapur: ఆధారాలు లేకపోతే సైలెంట్‌గా ఉండండి ఎమ్మెల్యే దగ్గుపాటి
Anantapur: మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ వైసిపి నాయకులకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాస్ వార్నింగ్.
Anantapur: ఆధారాలు లేకపోతే సైలెంట్‌గా ఉండండి ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపూర్: మెగా డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ వద్ద ఆధారాలు ఉంటే మాట్లాడాలని.. లేదంటే సైలెంట్ గా కూర్చోవాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం గ్రామంలో ఇంటింటికీ కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఏం చేశారు.
ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్నది ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఇది కక్షలు, కార్పణ్యాలు తీర్చుకుని గొడ్డలి పార్టీ కాదని.. ప్రజా క్షేమం కోరే కూటమి పాలన అని దగ్గుపాటి అన్నారు. గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థను నాశనం చేస్తే.. అలాంటి శాఖను మంత్రి నారా లోకేష్ ఛాలంజింగ్ గా తీసుకున్నారన్నారు.
కార్పొరేట్ విద్యా సంస్థలకు మించిన స్థాయిలో బడులను మార్చారన్నారు. 16347ఉపాధ్యాయ పోస్టులను ఎలాంటి వివాదం లేకుండా భర్తీ చేస్తే.. దీనిపై వైసీపీ నాయకులు పూటకో రాద్దాంతం చేస్తున్నారన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా పోలవరం, అమరావతి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు కేవలం ప్రభుత్వంపై బురదచల్లాలనే రోజుకో వివాదం సృష్టిస్తున్నారని.. వారు ఇప్పటికైనా నిరాధార ఆరోపణలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.




