Anantapur: ప్రజా దర్బార్ ఎఫెక్ట్: రాత్రివేళ బుల్లెట్‌పై అనంతపురం వీధుల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హల్‌చల్!
Anantapur: అనంతపురం నగరంలో వీధిలైట్లు వెలగడం లేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంటనే స్పందించి రాత్రివేళ బుల్లెట్‌పై నగరంలో పర్యటించారు.
Anantapur: ప్రజా దర్బార్ ఎఫెక్ట్: రాత్రివేళ బుల్లెట్‌పై అనంతపురం వీధుల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హల్‌చల్!
అనంతపురం: అనంతపురం నగరంలో వీధిలైట్లు వెలగడం లేదని ప్రజలు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు వెంటనే స్పందించి రాత్రివేళ బుల్లెట్‌పై నగర ప్రధాన వీధుల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, గుత్తి రోడ్డు, ఓల్డ్ టౌన్ ప్రాంతాల మీదుగా పర్యటిస్తూ వీధిలైట్లు, రహదారుల పరిస్థితులు, ఇతర ప్రజా సమస్యలను పరిశీలించారు.
ఎక్కడికక్కడ కనిపించిన సమస్యలను గుర్తించి నోట్ చేసుకున్నారు. పర్యటనలో భాగంగా పవిత్ర మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులను కలిసి వారి ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. వారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కలిసి టీ తాగి కొంతసేపు గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని, నగరంలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం తమ బాధ్యత అని,నగర అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.




