Anantapur: అనంతపురంలో 54వ ప్రజా దర్బార్ బాధితురాలికి రూ. 5 లక్షలు!
Anantapur: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ 54వ ప్రజా దర్బార్. డిసెంబర్ నాటికి 3 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు.
Anantapur: అనంతపురంలో 54వ ప్రజా దర్బార్ బాధితురాలికి రూ. 5 లక్షలు!
Anantapur: 54వ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. వచ్చే డిసెంబర్ నాటికి 3వేల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందజేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన 54వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజల సమస్యలు వింటూ వారి నుంచి అర్జీల స్వీకరించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తోపుదుర్తి నీరజకు ఎల్.ఓ.సి ద్వారా రూ.5లక్షల సాయం చేశారు. ఎల్.ఓ.సి. పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు 54సార్లు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే 1227అర్జీలు వచ్చాయని వాటిలో 1179 పరిష్కరించామని 45 పెండింగ్ లో ఉన్నాయన్నారు.
అర్జీల్లో ఎక్కువగా హౌసింగ్, పింఛన్ సమస్యలు ఉన్నాయని చెప్పారు. సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నా కాబట్టే అర్జీలు తగ్గుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. 2014-19సమయంలో టిడ్కో ఇళ్లు దాదాపు పూర్తి చేశామని.. ఆ తర్వాత వచ్చిన గొడ్డలి పార్టీ కేవలం తమ పార్టీ రంగులు వేసుకుని.. అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేశారని విమర్శలు చేశారు. మేము అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తున్నామని కొత్త పింఛన్లు కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు.




