Anantapur: రూ.107 కోట్లతో అమృత్ 2.0 ప్రాజెక్టులు ప్రారంభం

Anantapur: అనంతపురంలో రూ.107 కోట్లతో అమృత్ 2.0 పనులు ప్రారంభం. హాజరైన మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 15 Sept 2026 9:36 PM IST
Anantapur
X

Anantapur: రూ.107 కోట్లతో అమృత్ 2.0 ప్రాజెక్టులు ప్రారంభం

అనంతపురం: అనంతపురం టౌన్ నగరంలో రూ.107.71కోట్లతో కీలక ప్రాజెక్టులను ఇన్ ఛార్జి మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు. నగరంలో తాగునీరు, మురుగునీటి వ్యవస్థల ఆధునీకరణలో భాగంగా రెండు భారీ అమృత్ 2.0 పథకాల పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్సీ రమాదేవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నగరంలోని పాతవూరులోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ కాంపౌండ్ ఆవరణంలో ఈ పనుల ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది.

నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న అంతరాలను పూర్తిగా తొలగించి.. ప్రతి ఇంటికీ సమర్థవంతంగా నీటిని అందించడంతో పాటు, నూతన వాటర్ ట్యాంక్ లు, మురుగునీరు చేసే విధంగా భారీ శుద్ధి కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ తాగునీరు, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఈ పనులు చేపట్టామన్నారు.

మరోవైపు మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అమృత్ 2.0 పథకం ద్వారా నీటి సమస్య లేకుండా చేస్తున్నందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. అసలు అనంతపురంకి ఎక్కడా తాగునీటి సమస్య ఉండదన్నారు. మురుగునీరు శుద్ధి చేసేలా 25ఎం.ఎల్.డి ప్లాంట్ ను తీసుకొచ్చారన్నారు.

ప్రజలంతా ఈ రెండేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది.. ఎవరు చేశారన్నది గుర్తించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొరుపాటున వైసీపీని గెలిపిస్తే.. అభివృద్ధి ఆగిపోతుందన్నారు. వారికి కేవలం డబ్బు పదవులు మాత్రమే ముఖ్యమని.. పనులు చేయరన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 107కోట్లతో చేపట్టిన ఈ పనులను 6నెలల్లోగా పూర్తి చేస్తామన్నారు....

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM