Anantapur: వంశీ రిసార్ట్స్‌లో అట్టహాసంగా వివాహ వేడుక.. కూటమి నేతల సందడి!

Anantapur: అనంతపురంలో నిర్వహించిన ప్రముఖ పారిశ్రామికవేత్త వినాయక రెడ్డి - మణి చందనల వివాహ రిసెప్షన్ వేడుకకు జనసేన పార్టీ అడపా సురేంద్ర హాజరయ్యారు.

Srinivasulu, Madanapalle
Published on: 24 Jun 2026 11:13 AM IST
Anantapur
X

Anantapur: వంశీ రిసార్ట్స్‌లో అట్టహాసంగా వివాహ వేడుక.. కూటమి నేతల సందడి!

Anantapur: మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త వినాయక రెడ్డి, మణి చందనల వివాహ రిసెప్షన్ కార్యక్రమం మంగళవారం రాత్రి అనంతపురంలోని వంశీ రిసార్ట్స్ శ్రీకృష్ణ గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వధూవరులకు నూతన జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త రమణ, జనసేన యువ నాయకులు నరేంద్ర కుమార్, అజయ్ కుమార్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు, ప్రముఖులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story