Anantapur: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - 21 కిలోల వెండి స్వాధీనం

Anantapur: అనంతపురంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువైన 21 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడి.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 15 Sept 2026 9:39 PM IST
Anantapur
X

Anantapur: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - 21 కిలోల వెండి స్వాధీనం

అనంతపురం: అనంతపురం టౌన్ దేవాలయాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 40 లక్షలు విలువ చేసే 21 కిలోల వెండి ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు.

అనంతపురం నగరానికి చెందిన సాయికుమార్ చాంద్ భాష ఇద్దరు మిత్రులు వాహనాలకు వాటర్ సర్వీసింగ్ పని చేస్తూ జీవనం సాగించేవారు వీరికి సత్యసాయి జిల్లాకు చెందిన గుండప్ప గారి సుధమనే మరో మిత్రుడు పరిచయమయ్యాడు వ్యసనాలకు అలవాటు పడి వచ్చిన ఆదాయం సరిపోక దేవాలయాల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు 9 దేవాలయాలను టార్గెట్ చేసి ఆధారాలు లభించకుండా సిసి కెమెరాలను ధ్వంసం చేసి చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడేవారు కళ్యాణ్ దుర్గం రూరల్ పరిధిలోని రాంపురంలో ఇటీవల మారెమ్మ దేవాలయంలో దొంగతనానికి పాల్పడటంతో పోలీసులు వీరిపై నిఘా ఉంచారు.

కళ్యాణ్ దుర్గం రూరల్ పరిధిలో వీరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు వీరి ముగ్గురిపై ఇదివరకే పాత కేసులు ఐదు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు కుటాను అరెస్టు చేసిన పోలీసులను అభినందించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM