Gooty: గుత్తిలో ఘనంగా గుర్రం జాషువా 55వ వర్ధంతి

Gooty: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఘనంగా మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెన్షనర్స్ అసోసియేషన్.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 24 July 2026 3:59 PM IST
Gooty
X

Gooty: గుత్తిలో ఘనంగా గుర్రం జాషువా 55వ వర్ధంతి

గుత్తి: కవి కోకిల గుర్రం జాషువా 55వ వర్ధంతిని గుత్తి పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అబూబాకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా చిత్రపటానికి కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి, దళిత వర్గ జ్వలనుర్ప్తి అని కొనియాడారు. ఆయన తల్లిదండ్రులు వేరు వేరు కులాలకు చెందినవారని, చదువుకోసం బడిలో చేరిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు.

అయినప్పటికీ కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని సామాజిక మూఢాచారాలపై తిరగబడ్డారని, సమాజంలోని అసమానతలపై పోరాడారని కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు పేర్కొన్నారు. జాషువా రచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అబూబాకర్, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, వెంకటేష్, విజయలక్ష్మి, లక్ష్మీనారాయణ రెడ్డి, హసన్ అహ్మద్, గోవిందప్ప, నారాయణశెట్టి, వేణుగోపాల్, నరసింహులు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story