Anantapur: కార్పొరేట్ బడులను తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు

Anantapur: అనంతపురం శారదా మున్సిపల్ బాలికల పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం. హాజరైన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక మార్పులు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 24 July 2026 4:10 PM IST
Anantapur
X

Anantapur: కార్పొరేట్ బడులను తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు

అనంతపూర్: కూటమి ప్రభుత్వం చేపడుతున్న వినూత్న చర్యలతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, నేడు ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. శారదా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్' (Mega PTM) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన మరియు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

పాఠశాలలో సందడి చేసిన ఎమ్మెల్యే పాఠశాలలో విద్యాబోధన, అందుబాటులో ఉన్న సౌకర్యాలు మరియు 'తల్లికి వందనం' పథకం అమలు తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించిన ఆటల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ముఖ్యంగా 'టగ్ ఆఫ్ వార్' (తాడు లాగే ఆట) ఆడి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. అనంతరం విద్యార్థులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పంక్తి భోజనం చేశారు."గతంలో 'పేరెంట్స్ మీటింగ్' అనే పదం కేవలం కార్పొరేట్ పాఠశాలల్లోనే చూసేవాళ్లం. కానీ నేడు మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అంతకంటే పండుగ వాతావరణంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయం.

గత ప్రభుత్వంలో పిల్లల పుస్తకాలు, చివరకు బెల్టులపై కూడా జగన్ బొమ్మలు వేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కానీ నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దారు. పాఠశాలల్లో మారిన సౌకర్యాలు చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈనాడు కార్పొరేట్ విద్యాసంస్థలను వదిలి అందరూ ప్రభుత్వ బడుల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు."

'తల్లికి వందనం'ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున 'తల్లికి వందనం' నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా విద్యార్థుల లబ్ధి కోసం రూ. 10,120 కోట్లు అందజేశామని తెలిపారు.విద్యా వ్యవస్థలో ఇంతటి బృహత్తర మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story