Anantapur: అనంతపురంలో గంజాయి ముఠా గుట్టురట్టు.. 14 మంది అరెస్ట్!
Anantapur: అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న 14 మంది ముఠాను వన్ టౌన్ మరియు ఈగల్ బృందం పోలీసులు ఉమ్మడిగా అరెస్టు చేశారు.
Anantapur: అనంతపురంలో గంజాయి ముఠా గుట్టురట్టు.. 14 మంది అరెస్ట్!
Anantapur: అనంతపురంలో గంజాయి విక్రయిస్తున్న 14 మంది ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. అనంతపురం శివారు ప్రాంతానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఇందులో కీలక నిందితుడుగా ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇటీవల గంజాయి కిట్ల పరీక్షలు నిర్వహించే క్రమంలో కొంతమంది అనుమానితులను పరిశీలించినట్లు తెలిపారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్, ఈగల్ బృందం పోలీసులు సంయుక్తంగా ఈ కేసును సేవించినట్లు తెలిపారు. ఇందులో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని ఎస్పీ చెప్పారు.
గుంతకల్లు రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి సురేష్ అనే కీలక నిందితుడు కిలో పదివేలు చొప్పున కొనుగోలు చేసి దానిని మరొక నలుగురు వ్యక్తుల నుంచి అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారని, మొత్తం 14 మంది ముఠా కలిసి చిన్న చిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ పొట్లాలను పలు ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే వీరందరినీ అరెస్టు చేశామని గంజాయి కి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేస్తామన్నారు. గంజాయి కిట్ల పరీక్షల ద్వారా గంజాయి వాడుతున్న వారి వివరాలను తెలుసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పారు. గంజాయి కట్టడికి కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు.




