Anantapur: ఎల్‌నినో నేపథ్యంలో శాస్త్రవేత్తల పర్యటన

Anantapur: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరులో శాస్త్రవేత్తల బృందం పర్యటించింది.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 19 July 2026 7:50 AM IST
Anantapur
X

Anantapur: ఎల్‌నినో నేపథ్యంలో శాస్త్రవేత్తల పర్యటన

Anantapur: అనంతపురం జిల్లా పామిడి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పామిడి మండలంలో పంటల పరిస్థితిని పరిశీలించేందుకు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం శనివారం పర్యటించింది.

పామిడి మండలం పొగరూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పత్తి, కంది, సజ్జ తదితర పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల ఎదుగుదలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమాలో నమోదు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా బీమా ద్వారా తగిన ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story