Anantapur: జీవో 396 రద్దుకై డాక్యుమెంట్ రైటర్ల ‘పెన్ డౌన్’
Anantapur: జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు 10 రోజుల పెన్ డౌన్.
Anantapur: జీవో 396 రద్దుకై డాక్యుమెంట్ రైటర్ల ‘పెన్ డౌన్’
Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్: ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు, గుత్తి మరియు పామిడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లు సోమవారం నుంచి 10 రోజుల పెన్ డౌన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గుత్తి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు శ్రీకరం నరేష్, రాయల్, గండికోట రఘువీర్, బండి సత్య మాట్లాడుతూ GO 396 వల్ల తమ ఉపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లతో పాటు స్టాంప్ వెండర్లు రమణ, సాయిరంగస్వామి, రామకృష్ణ, తాజుద్దీన్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరసనను విజయవంతం చేయాలని అందరూ సహకరించాలని వారు కోరారు.
ఇదే విధంగా గుంతకల్లు, పామిడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కూడా డాక్యుమెంట్ రైటర్లు GO 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెన్ డౌన్ చేపట్టారు.
ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని డాక్యుమెంట్ రైటర్లు హెచ్చరించారు. దీంతో రిజిస్ట్రేషన్లకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.




