Anantapur: ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’లో ఎమ్మెల్యే దగ్గుపాటి
Anantapur: కమలానగర్లో ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు.
Anantapur: ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’లో ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపూర్: గత రెండేళ్లలో 50 డివిజన్లు, 4 పంచాయతీల్లో అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రూ. 1,296 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. రూ. 250 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించగా, త్వరలోనే మరో రూ. 160 కోట్లతో కొత్త పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గంలో "ఇంటింటికి కూటమి ప్రభుత్వం" కార్యక్రమం ఇప్పటికే 85% పూర్తయిందని వెల్లడించారు.అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేశామని, ఒక్క సంతకంతో పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు కి దక్కుతుందన్నారు.
అదేవిదంగా 'తల్లికి వందనం' ద్వారా రికార్డు స్థాయిలో సాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు.ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు మెరుగుపడటంతో ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు చేరుతున్నారని, అదేవిధంగా రూ. 5 కే ఐదు రకాల భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్లను తిరిగి పునఃప్రారంభించినట్లు పేర్కొన్నారు.
రాయలసీమ వ్యాప్తంగా పెట్టుబడులు పెరుగుతున్నాయని, హార్టికల్చర్ హబ్ కోసం రూ. 40,000 కోట్లు, పిపిపి (PPP) మోడల్లో మరో రూ. 60,000 కోట్లతో మొత్తం అనంతపురం జిల్లాకే రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు.పుట్టపర్తిలో 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమలు కూడా వస్తున్నాయని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు.




