Anantapur: కార్పొరేట్ స్కూల్‌లో దారుణం.. చిన్నారిపై అత్యాచార యత్నం!

Anantapur: కార్పొరేట్ స్కూల్‌లో చిన్నారిపై నిందితుడు ఎల్లప్ప అత్యాచార యత్నం. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనంతపురం టు టౌన్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 1:11 PM IST
Anantapur
X

Anantapur: కార్పొరేట్ స్కూల్‌లో దారుణం.. చిన్నారిపై అత్యాచార యత్నం!

Anantapur: అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఓ కార్పొరేట్ స్కూల్‌లో చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో ఎల్లప్ప అనే వ్యక్తి చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. గతంలోనూ చిన్నారితో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనపై అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఎల్లప్పను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. పాఠశాల నిర్లక్ష్యం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story