Anantapur: అనంతపురంలో టీడీపీ మహానాడు సందడి: ఏపీ భవిష్యత్తు కోసం బాబు ప్లాన్ ఇదే!

Anantapur: అనంతపురంలో 44వ టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది! ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ హైబ్రీడ్ వేడుకలో కీలక నిర్ణయాల గురించి నాయకులు చర్చించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 28 May 2026 7:23 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో టీడీపీ మహానాడు సందడి: ఏపీ భవిష్యత్తు కోసం బాబు ప్లాన్ ఇదే!

Anantapur: అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమంలో ఘనంగా ప్రారంభమైంది. పార్టీ చరిత్రలో తొలిసారి హైబ్రీడ్ విధానంలో మహానాడు జరుగుతుండటంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 12క్లస్టర్ల పరిధిలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అర్బన్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో ఎమ్మెల్యే దగ్గుపాటి, జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ ఆంబికా లక్ష్మీనారాయణ ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేసి ఎన్టీఆర్ కు ఘన నివాళలర్పించారు. ఆతర్వాత హాజరు నమోదు చేసి.. మహానాడును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 43మహానాడులకంటే ప్రస్తుతం జరిగే 44వ మహానాడుకు ప్రత్యేకత ఉందన్నారు. నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హాదాలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. స్త్రీ శక్తి, కార్యకర్తే నా అధినేత, యువత భవిష్యత్ వంటి అంశాలను ప్రధాన్యతగా తీసుకున్నామన్నారు. ఈ రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వంటి వాటితో ఏపీ వైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. రానున్న మూడేళ్లలో ప్రతి తెలుగు వాడు గర్వపడేలా, రాష్ట్ర భవిష్యత్ కోసం రోడ్డు మ్యాప్ చేసుకుంటామన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఏది చేసినా వినూత్నంగా కొత్తదనంతో ఉంటుందని.. పొదుపు చర్యలకు ఈ మహానాడు కూడా అందరికీ ఆదర్శమవుతుందన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story