Pamidi: పామిడిలో వైభవంగా సౌదుర్తి ఎల్లమ్మ బోనాల ఉత్సవం

Pamidi: పామిడి వాణినగర్ సౌదుర్తి ఎల్లమ్మ ఆలయంలో శ్రావణ బోనాల వేడుకలు. మహిళల గ్రామోత్సవం, డప్పు చప్పుళ్లతో బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 31 July 2026 5:54 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో వైభవంగా సౌదుర్తి ఎల్లమ్మ బోనాల ఉత్సవం

పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణం వాణినగర్ లో వెలసిన సౌదుర్తి ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా భక్తులు తొలుత కొత్త కుండలలో తీపి అన్నం నింపి, వాటిని పసుపు, కుంకుమ, పూలు, వేపమండలతో అలంకరించారు.

అనంతరం ఆలయం నుండి మహిళా భక్తులు బోనపు కుండలపై దీపాలు ఉంచుకుని, డప్పుల మ్రోతలతో గ్రామోత్సవం గావించారు. బోనం ఎత్తుకున్న మహిళలు భక్తి పాటలతో అమ్మవారిని కీర్తిస్తూ ఆలయానికి చేరుకున్నారు.

ఉత్సవం అనంతరం పూజారి రామేశ్వరమ్మ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వాణినగర్ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story