Anantapur: మట్టి గణపతులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: బీజేపీ నేతలు!
Anantapur: వినాయక చవితి సందర్భంగా అనంతపురంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో 5,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
Anantapur: మట్టి గణపతులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: బీజేపీ నేతలు!
అనంతపురం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో 5000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను పుర ప్రజలకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు.
ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, మన సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువలను కాపాడేందుకు అశోక్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు సేవ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారని కొనియాడారు.
అశోక్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే హౌసింగ్ బోర్డు కాలనీ మరియు పుర ప్రజలకు తన వంతుగా 5000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
మట్టి వినాయకులను వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా పండుగను ఆనందంగా జరుపుకోవచ్చని, ప్రజలందరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అశోక్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, బోయ లక్ష్మణ్, రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేష్ నాయుడు,తిరుములరెడ్డి, శాంత కుమార్,మల్లోబులు, ప్రసాద్, రవికుమార్, ఈశ్వర్ ప్రసాద్, నాగరాజు, గురు శ్రీధర్, సునీల్, మరియు తదితరులు పాల్గొన్నారు.




