Anantapur: కార్పొరేట్ పాఠశాలలో రెండవ తరగతి చిన్నారిపై అఘాయిత్య యత్నం

Anantapur: అనంతపురం కార్పొరేట్ పాఠశాలలో రెండవ తరగతి చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడు ఎల్లప్పపై పోక్సో కేసు నమోదు చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 9 Sept 2026 5:37 PM IST
Anantapur
X

Anantapur: కార్పొరేట్ పాఠశాలలో రెండవ తరగతి చిన్నారిపై అఘాయిత్య యత్నం

అనంతపూర్: నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో రెండవ తరగతి చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో ఎల్లప్ప 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.గతంలోనూ సదరు వ్యక్తి చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనపై అనంతపురం టు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.ఫోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితుడు ఎల్లప్పను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డి.ఎస్.పి తెలిపారు.

ఈ ఘటనలో పాఠశాల నిర్లక్ష్యం ఉందా? అనే కోణంతో పాటు అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతోందని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శివప్రసాద్ వెల్లడించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story