Anantapur: అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్ 20 బైక్‌ల స్వాధీనం

Anantapur: అనంతపురంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసిన 1-టౌన్ పోలీసులు. రూ.20 లక్షల విలువైన 20 మోటార్ సైకిళ్లు స్వాధీనం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 17 Aug 2026 7:07 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్ 20 బైక్‌ల స్వాధీనం

అనంతపూర్: అనంతపురంలో వరుస మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న బైక్ దొంగల ముఠాను 1-టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన 20 చోరీ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు పరిసర ప్రాంతాలలో జరుగుతున్న వరుస వాహన దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పక్క సమాచారం మేరకు దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.ప్రధాన నిందితుడు నార్పల గ్రామానికి చెందిన 20 ఏళ్ల కుమ్మర కిశోర్ బాబు ఈ ముఠాకు నాయకత్వం వహించాడు.

ముఠా ఇతనితో పాటు మరో ముగ్గురు బాలనేరస్తులు ఈ నేరాల్లో భాగస్వాములుగా ఉన్నారు.వీరు నకిలీ తాళాలు ఉపయోగించి పార్కింగ్ స్థలాల్లో ఉన్న బైక్‌లను క్షణాల్లో దొంగిలించేవారు.దొంగిలించిన వాహనాలను ఎవరికీ అనుమానం రాకుండా సమీపంలోని కంపచెట్లలో దాచేవారు. ఆ తర్వాత వాటిని బెంగళూరు లేదా బళ్లారి పరిసర ప్రాంతాల్లో విక్రయించడానికి ప్లాన్ వేసేవారు.

స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు

పోలీసులు స్వాధీనం చేసుకున్న 20 బైక్‌లు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధికి చెందినవిగా గుర్తించారు

అనంతపురం 1-టౌన్... 13 మోటార్ సైకిళ్ళు.

అనంతపురం 4-టౌన్.. 4 మోటార్ సైకిళ్ళు.

కదిరి పట్టణం...1

తిరుపతి......1

దొడ్డబళ్లాపూర్(కర్ణాటక)...1 ఈ ప్రాంతాల్లో దొంగలించారు

ప్రధాన నిందితుడు కిశోర్ బాబును రిమాండ్‌కు తరలించగా, మిగిలిన ముగ్గురు మైనర్లపై బాలనేరస్థుల చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు.

వాహనదారులకు పోలీసుల సూచనలు...

బైక్‌లను పార్కింగ్ చేసే సమయంలో కేవలం హ్యాండిల్ లాక్‌పైనే ఆధారపడకుండా, తప్పనిసరిగా అదనపు సెక్యూరిటీ లాక్‌లు (వీల్ లాక్స్/అలారం లాక్స్) వాడాలి. పార్కింగ్ ఏరియాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తుంటే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story